మొలక అమేయ:-డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871.

 మొలకన్నీ అక్షరాలే
మహా రూపాలన్నీ 
చిరు మొలకల జీవితాలే
ప్రతి మనిషీ పసి నవ్వుతోనే
చూసేదీ మట్టిని
బాల్యం ప్రతి అడుగూ
అమూల్యం అడుగడుగునా
బుచ్చి బుచ్చి మాటలే
అచ్చంగా గొప్ప గొప్ప కథలుగా
బతుకు బతుకుతుంది అన్నిట
జోల పాటలో అమ్మ ప్రేమ దొడ్డది
అ ఆ లలో నాయిన ఆత్మ పెద్దదే
ఆటలలో సోదరుల చూపు నవ్వే
మొలకలో సంతోషం మహావృక్షం 
  బంధంలో కొత్త మొలక అమోఘం
మనసు పిలుపు చిన్నదైన మొలక
మనిషి అలోచన అమేయ
అద్భుతం జరుగుతుంది మొక్కలో
అనంతం ప్రవహించు నీటిచుక్కతో
చిరు జీవి గొంతుక ప్రగతి జగతి
చిన్నమొలక నవ్వు అపూర్వ పురోగతి

కామెంట్‌లు