ఓం గం గణపతయే నమః!ఏక దంతుడు "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098

 👌 ఏక దంతుడ వీవు!

      ఏకైక నాథుడవు!
      లోకేశ్వరా! హరా!
                 ఓ విఘ్న రాజ!
        ( విఘ్న రాజ  పదాలు., )      
🔯 శ్రీ మంతుడైన పరమేశ్వరుడు.. ఒక్కడే! శ్రీ స్వామి వారు.. పలు విధములైన నామములతో, రూపములతో... పేర్కొనబడు చున్నాడు!
🔯 గాణాపత్య సిద్ధాంతం ప్రకారం, సచ్చిదానంద స్వరూపుడైన పరం బ్రహ్మ మే.. శ్రీ మహా గణాధిపతి స్వామి వారు! విఘ్న నాథుడు.. ఏనుగు ముఖము కలవాడు. కనుక, గజాననుడని పేరు!
🔯 "ఏక దంత" నామము... శ్రీ వర సిద్ధి  వినాయకుని యొక్క విశిష్ఠ నామములో; సుప్రసిద్ధ మైనది. అది.. సర్వ శక్తిమంతుడైన  పరమేశ్వరుని తత్త్వమును సూచించు చున్నది!
🙏 ప్రార్థనా పద్యం (కందము)
      గజముఖుని, ఏక దంతుని,
      భజయింతును వాణి, గౌరి, పంకజ నిలయున్;
      నిజ భక్తి బుద్ధి విద్యా
      త్రి జగతి ఖ్యాత్యాయురు దయ తేజమ్ము లకై!
          (చాటు పద్య మణి మంజరి., పూర్వ కవి విరచితము., )
       ఓం గం గణపతయే నమః!

కామెంట్‌లు