👌ఏనుగు ముఖము తోను
విలసిల్లు చున్నావు!
గజానన! వినాయక!
ఓ విఘ్న రాజ!
( విఘ్న రాజ పదాలు.,)
🔯 శ్రీమహా గణాధిపతి స్వామి వారు.. ఏనుగు ముఖముతో, గుజ్జు రూపముగా దర్శన మిచ్చు చున్నాడు. కనుక, "గజాననుడని" పేరు!
🔯వినాయకుడు అధ్యాపకులకు అధ్యాపకుడు! విద్యార్థులకు.. ఉపాధ్యాయునిగా... కోరిన విద్యలను ప్రసాదించు చున్నాడు! అట్లే, ఆరాధకులకు.. అభయ ప్రదానము కావించు చున్నాడు.. శ్రీ మహా గణాధిపతి స్వామివారు!
🙏ప్రార్ధనా పద్యము
(ఉత్పల మాల)
తొండము నేకదంతమును, తోరపు బొజ్జయు, వామ హస్తమున్,
మెండుగ మ్రోయు గజ్జెలును, మెల్లని చూపులు, మంద హాసమున్,
కొండొక గుజ్జు రూపమున, కోరిన విద్యల కెల్ల నొజ్జయై
యుండెడి, పార్వతీ తనయ! ఓయి గణాధిప! నీకు మ్రొక్కెదన్!!
( చాటు పద్య మణి మంజరి., పూర్వ కవి విరచితం., )
ఓం గం గణ పతయే నమః!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి