నారాయణి! నమోస్తు తే!:- "కాత్యాయనీ దేవి" "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098

 👌 సౌమ్య వదనవు నీవె!
        విశా లాక్షివి నీవె!
        కాత్యాయనీ! జనని!
     
               నారాయణి!  శివాని!
 ( "నారాయణి" పదాలు., )      
🔯 పరం బ్రహ్మ రూపిణి, నారాయణి ...కాత్యాయనీ దేవి! ప్రసన్నమైన వదనము తో; సూర్యుడు, చంద్రుడు, అగ్ని... అనెడు, మూడు కన్నులతో నున్నది, కాత్యాయనీ జనని!
🔯 శ్రీ మహా రాజ్ని...కాత్యాయనీ దేవి, భక్త మహాశయు లందరిని...సమస్త మైన భయము  నుండి కాపాడు చున్నది... కాత్యాయనీ దేవి!
🔯 ఆది పరాశక్తి  యగు, పరమేశ్వరి కి... రెండు చేతులను జోడించి, భక్తి ప్రపత్తు లతో నమస్కరించు చున్నాను! అని, మన మంతా.. శ్రీమాతను ధ్యానించాలి!
🙏ధ్యాన శ్లోక రత్నము:
       ఏతత్తే వదనం సౌమ్యం
       లోచన త్రయ భూషితం!
       పాతు నః సర్వ భీతిభ్య:!
       కాత్యాయని! నమోస్తు తే!
( "నారాయణి స్తోత్రం".. శ్రీ దుర్గా సప్త శతి"  ఏకాదశ అధ్యాయం లోనిది. నిత్యము పారాయణము చేయండి. )
కామెంట్‌లు