మా ఊరు గొప్పతనం:--- బి.పుష్పాంజలి -9వ తరగతి,ఈ/యం,-జి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.

 అనురాగాలకు నిలయం
ఆనందాల హరివిల్లు
ఆరుబయట ముచ్చట్లు
అమ్మమ్మ తాతయ్యల కథలు
అద్భుతాలు ఎన్నెన్నో
అందరి మాటల కమ్మదనం
ఆరోగ్యాన్ని పెంచును
అడుగడుగునా సహకారం
అందరి ప్రజల మమకారం
చిందులు వేసే చిన్న పెద్దలు
చీటికి మాటికి పండగలు
చింత లేక మేమంతా
కలిసిమెలిసి ఉంటాము
కుల మత భేదం లేనేలేదు
ఆపద వస్తే మేమంతా
అండగ మేము నిలబడతాం
ఇదే మా ఊరు గొప్పతనం

కామెంట్‌లు