రైతు లేనిదే దేశం లేదు
లోకానికి అన్నదాత
ఎండకు ఎండి తాను
వానకు తడిసి రైతు
హలము పట్టి పొలము దున్ని
పసిపాపలా చూసుకుని
కంటి నిండా నిద్ర లేక
కడుపునిండా తిండిలేక
పంట పొలముచూసుకుంటూ
పంట మంచిగ పెరగగా
మురిసిపోవు రైతురా
బీటు కు తీసుకెళ్లగా
బిక్కముఖము వేయును
మంచి ధర రాలేదని
చింతజేయును రైతన్న
పరుల ఆకలి తీర్చును
తాను పస్తులుండినా!
రైతు రాజు కాలేడు
రంది లేక ఉంటే చాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి