దివ్య చిన్ననాటి కల..:-తాటికోల శ్రీజ మానస.9 వ తరగతి,గుంటూరు..

 ఒక ఊరిలో దివ్య అనే అమ్మాయి ఉంది.దివ్య తల్లిదండ్రులు కిషోర్ మరియు లక్ష్మి.కిషోర్ ఒక నిజాయితీ గల గొప్ప డాక్టర్.దివ్య కి ఒక తమ్ముడు, అతని పేరు సాత్విక్.కిషోర్ కి దివ్య తన లానే ఒక డాక్టర్ అవ్వాలని కోరిక. లక్ష్మి కోరిక కూడా అదే.కానీ దివ్యకి తనని ప్రపంచం ప్రత్యేకంగా గుర్తించాలని ఉండేది.అల అని దివ్య చదువును దూరం పెట్టదు.తను చదువులో టాప్ స్టూడెంట్.దివ్య కి చిన్నపాటి నుండి వెస్ట్రన్ డాన్స్ అంటే చాలా ఇష్టం.కానీ దానిని ఎలా నేర్చుకోవాలి తనకి తెలీదు.దివ్య తల్లిదండ్రులు తనని ఎలాంటి డాన్స్ క్లాసులకు పంపిలేదు.మెల్లగా దివ్య పెద్దయ్యే కొద్ది ఫోన్ గురుంచి తెలుసుకుంది.ఇప్పుడు తను కలిగ ఉన్న సమయం లో డాన్స్ ప్రాక్టీస్ చేసేది.కానీ ఇది తన చదువును దెబ్బతీలేదు.ఇది గమనించిన తల్లిదండ్రులకు ఇది నచ్చలేదు.ఒక రోజు తనని కూర్చోపెట్టి బాగా అరిచారు.వాళ్ళు తనని అరిచినప్పటి నుంచి తనకు ఎది ఏమైనా తను డాన్సర్ అయ్యేటిరాలనే గట్టి నమ్మకం ఎర్పడింది.దివ్య డాన్సర్ అవ్వలనుకోవడానికి తన తల్లిదండ్రులు కూడా ఒక కారణం.తను తన తల్లిదండ్రులను చిన్నపాటి నుంచి చాలా ప్రేమించేది,కనుక వాళ్ళని చాలా బాగా చూసుకోవాలని అనుకుంది.అప్పటి నుంచి దివ్య తల్లిదండ్రులు లేని సమయంలో డాన్స్ ప్రాక్టీస్ చేసేది.అల అల కొద్ది నెలలు గడిచాయి.దివ్య డాన్సర్ అవ్వాలనే కోరిక తన తల్లిదండ్రులకు చెప్పక పోతే ఆలస్యం అవుతుంది అనుకొని ఎంత తొందరగా చెప్తే అంత మంచిది అనుకుంది. ఒక రోజు దివ్య, తన తల్లిదండ్రులు కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటున్న సమయం లో దివ్య ఇదే సరిన సమయం అనుకుంది.ఎది ఏమైనా సరే ఈ రోజు వాళ్ళని ఒప్పించాలి రండి మాటే లేదు అనుకుంది.దివ్య మెల్లగా వాళ్ళతో తన కల అదే తను డాన్సర్ అవ్వాలనే కల చెప్పింది.డాన్సర్ అనే పదం వినగానే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చింది.వాళ్ళు తనను చాలా తిట్టారు.కానీ తను అన్ని బరించి మెల్లగా వాళ్ళకి అన్ని అర్థం అయ్యేటట్లు నిదానంగా చెప్పింది.చివరికి కిషోర్ ఇలా అన్నాడు"సరే నువ్వు ఇప్పడికి ఇప్పుడే ఒక పాటకి డాన్స్ చేసి చూపించు అది మ ఇద్దరికీ నచ్చితే సరే నికు ఓకే ఒక్క అవకాశం ఇష్టం ఒకవేళ మకు నచ్చక పోతే నువ్వు నేను చెప్పినట్టు బాగా చదువుకొని నాలాగే డాక్టర్ అవ్వాలి అన్నాడు". దివ్య ముఖం వెలిగి పోయింది.దివ్య వెంటనే ఒక పాట పెట్టి డాన్స్ చేయడం మొదలు పెట్టింది.తను డాన్స్ చేసే విధానం చూసి ఇద్దరు చాలా అర్చయర్య పోయారు.దివ్య ఎంతో కష్టమైన స్టెప్పులు కూడా చాలా సులభంగా చేసింది.పాట అయిపోయాక దివ్య ఆయాసపడుతూ తన తల్లి వంక చూసింది.లక్ష్మి నోట మాట రాలేదు.దివ్య నువ్వు ఇంత బాగా ఎలా చేశావు నేను నమ్మలేక పోతున్నాను అన్నది.దివ్య నవ్వి కిషోర్ వంక చూస్తూ ఇలా అంది "నాన్న నువ్వు మాట్లాడవే నికు నచ్చలేదా" అని కొంచం భయంగా అడిగింది.వల్ల నాన్న చూసి లేదమ్మా నువ్వు చాలా బాగా చేశావు నేను నిన్ను ఇప్పుడే డాన్సర్ అవ్వడానికి ఒప్పుకుంటాను కానీ నిన్ను ఒక్కదన్నినే డాన్స్ కోసం లండన్ ఎలా పంపిను అన్నాడు.దివ్య నన్ను నమ్ము నాన్న ఒక్క అవకాశం ఇచ్చిచుడు అని మెల్లగా వాళ్ళకి సద్ధి చెప్పింది.మెల్లగా దివ్య లండన్ కి వెళ్ళింది.అక్కడ 6 నెలలు తిరగకుండానే తను ఒక గొప్ప డాన్సర్ గా పేరుతెచ్చుకున్నది.ఇప్పుడు దివ్య తన తల్లిదండ్రులను చాలా బాగా చూసుకుంటున్నది.

నోట్:నేను ఈ కదా ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు మీ కలని నెరవేర్చుకోవచు కానీ దానికి కొంత సమయం పడుతుంది.అప్పటి వరకు మీరు సాధన,ఓపిక,నమ్మకం కలిగి ఉండాలి.అప్పుడే మీరు అనుకున్నది సాధించగలరు.మీరు కష్టపడి,ఓపికగా సాధన చేస్తూ,నమ్మకంగా ఉండాలి అప్పుడే మీరు అనుకున్నది సాధించగలరు.మీరు మొదటిలో కష్టపడితే తర్వాత సుఖపడుతారు కదా!
ఈ కదా మీకు సాయపడుతుంది అనుకుంటున్నాను..
ధన్యవాదాలు

కామెంట్‌లు