నిజమైన భక్తి! అచ్యుతుని రాజ్యశ్రీ

 భగవాన్ మహావీర్ తన శిష్యులకి  ఉదాహరణ చెప్పి కథల ద్వారా విషయం వివరించేవారు.ఒక రోజు  శిష్యుడైన గణధరుడు ఇలా ప్రశ్నించాడు."భన్తే!నాకు తెలిసిన ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఒకడు పొద్దస్తమానం దేవుని స్తోత్రాలు చదువుతూ ఇంటి విషయాలు పట్టించుకోడు.భార్య పిల్లలు  కుటుంబంని  ఈడుస్తున్నారు.ఏదైనా చెప్పబోతే "ఆదేవుడు చూసుకుంటాడు. నాకు చెప్పి  సంసార లంపటంలో ఈడ్చకండి"అనేసి పోయి గుడిలో కూలబడేవాడు.తనే గుడి ఊడ్చటం దేవుని పాత్రలు శుభ్రం చేయటంతో ఆలయ ధర్మకర్త  అప్పటి దాకా  ఆపనులు చేస్తున్న నౌకరుని జీతం దండగ అని తీసేశాడు.వాడు లబోదిబో అంటూ  ఊరిపెద్దలకి మొరపెట్టుకున్నాడు. ఇక రెండో మిత్రుడు గుడి మొహం చూడడు.ఇంటి అవసరాలు చూసి గ్రామ పంచాయతీ కి వెళ్లి చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసేవాడు. ఎవరికి ఏఇబ్బందివచ్చినా వెంటనే వాలేవాడు.గుడి ముందు  దివ్యాంగులకి పళ్లు పంచేవాడు.అంతా అతన్ని మెచ్చుకునేవారు. భగవాన్! వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠుడు?"
శిష్యుని ప్రశ్నకు భగవాన్ ఇలా అన్నాడు "నాయనా!రెండో వ్యక్తి అన్నివిషయాలలోనూ అధికుడు.ఎవరికి వారు దేవుని పేరు తో గుడిలో సేవ అని ఆర్భాటంగా  నలుగురికీ తెలిసేలా చేయటం పటాటోపం.నాలాంటివారు  సరియైన దారిచూపాలి.లేకుంటే మంచి చెడు  ధర్మం అధర్మం  ఎలా తెలుస్తాయి?సాధు సన్యాసులు  కూడా  ఒకే రాజ్యం  ప్రాంతంలో ఉండరాదు.సంచరిస్తూ ధర్మ బోధన చేయాలి. "చూశారా మరి?నేటి  మన పీఠాధిపతులు కూడా చేసే పని అదే!కంచి శృంగేరిజగద్గురువులు ధర్మ రక్షణ మన భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షిస్తూ ప్రజలకు ఉపయోగపడే అనేక సేవాకార్యక్రమాలు చేస్తారు. రామకృష్ణ మఠంవారు ఆర్.ఎస్.ఎస్.వారు  తుఫాను భూకంపాలు  కోవిడ్ మహమ్మారి కాలంలో చేస్తున్న సేవలు నిశబ్దం గా ఉండిపోతున్నాయి.మన పోలీసులు వైద్య రంగం సైనికుల సేవలు మరువలేనివి.ఎవరికి వారు  జాగ్రత్తగా ఉంటూ వారికి సాయంచేయాలి.అదే నిజమైన భక్తి!
కామెంట్‌లు