ఊర్లోనే ఒక కోడి తెల్లవారేసరికి ఇంటి చూరుపై ఎక్కి కూత కూసే ది. ఊర్లోనే మిగతా కోళ్ళు మేము కూసి నట్లే నేల మీద నిలబడి కూయ వచ్చు కదా అని అడిగాయి. అయినా ఆ కోడి వారి మాటలను ఖాతరు చేయలేదు. అలా అలా చేయడం వల్ల యజమాని మన్ననలు పొందవచ్చని భావించింది. తన కూతను మెచ్చి మంచి తిండిగింజలు పెడతాడని ఆశించింది. ఊరంతా ఒక తోవ అయితే ఉలిపిరి కట్టె ఒక దోవ అనే మాదిరి ఉంది దీని వ్యవహారం అని మిగిలిన కోళ్ళు తిట్టు కొన్నాయి.
మంచి వర్షాకాలం వచ్చింది వారం రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వాన కి భయపడి ఆ కోడి చురు పైకెక్కి కూత కూయ లేక పోయింది. కోడికి పొగరు పట్టిందని భావించిన యజమాని దానిని రాళ్లతో చితకబాదాడు. మిగిలిన కోళ్ళు దాన్ని ఓదారుస్తు ఏదైనా మితంగా చేయాలి అతి చేయకూడదు. ఉత్సాహం ఉండాలి, అత్యుత్సాహం పనికిరాదు అని హెచ్చరించాయి. అతి వద్దు మితం ముద్దు అని తెలుసుకున్న కోడి ఎప్పటినుంచి జాగ్రత్తగా వ్యవహరించ సాగింది. ఏదైనా నా మితంగా ఉంటేనే బాగుంటుంది.
కోడి కూత. సేకరణ తాటికోల పద్మావతి గుంటూరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి