*అక్షర మాల గేయాలు**సంయుక్తాక్షర గేయం వ-ఒత్తు*:- *వురిమళ్ల సునంద,ఖమ్మం*

 అశ్విని ఉజ్వల శార్వాణి
దీపావళి పర్వదినమని
ఈశాన్వి ఇంటికి వచ్చారు
దర్వాజాలకు పూలమాలలు
స్వాగతమంటూ కట్టారు
పార్వతమ్మ చేసిన హల్వా
స్వీటు పాయసం బాగుందని
ఆస్వాదిస్తూ హాయిగ తిన్నారు
ధ్వనులు చేసే టపాసులొద్దని
కాకరపూలను వెలిగించారు

కామెంట్‌లు