చిన్నపిల్లల పొట్టలో నులి పురుగుల సమస్య - నివారణ:పి . కమలాకర్ రావు

 చిన్న పిల్లల పొట్టలో నులి పురుగులు చేరితే నిద్రలో పళ్ళు కోరుకుడు శబ్దం వినిపిస్తుంది. కడుపులో నొప్పి కూడా రావచ్చు.
లేత బొప్పాయి ఆకును బాగా కడిగి నీటిలో వేసి మరిగించి చల్లార్చి తేనె కలిపి త్రాగిస్తే కడుపు లోని పురుగులు నశిస్తాయి.
గుమ్మడి గింజలనువేయించి  పొడిచేసి కొద్దిగా ఉప్పు కారం వేసి అన్నములో తినిపిస్తే పురుగులు పడి పోతాయి.
ఆహారంలో కొబ్బరిని, క్యారట్ ను ఎక్కవగా వాడినా పురుగులు రావు.
లేత వేపాకు ను కడిగి రసం తీసి  తేనె కలిపి త్రాగించినా కూడా నులి పురుగులు మలం లో పడి పోతాయి.
కామెంట్‌లు