అక్షరయజ్ఞం:-తోపుడుబండి సాదిక్.

 చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గత రెండేళ్లలో విద్యా రంగం అస్తవ్యస్త మయ్యింది.దాదాపు 500 రోజులకు పైగా పాఠశాలలు మూసేయడంతో ఒక తరం విద్యార్థుల చదువులు ఆటకెక్కాయి.ముఖ్యంగా ప్రాధమిక స్థాయి పిల్లలైతే అక్షరాలు రాయటం,చదవటం కూడా మర్చిపోయారు. రెండేళ్ల పాటు అక్షరం చదవకున్నా పై తరగతులకు ప్రమోట్ అయ్యారు.ఇప్పుడు నాలుగు,ఐదు తరగతుల్లో ఉన్న పిల్లలు కూడా అక్షరమాల రాయలేకపోతున్నారు.
   ఇటీవల పాఠశాలలు తెరవడంతో మెల్లగా పిల్లలు బడికి రావటం అలవాటు చేసుకుంటున్నారు.సర్కారు బళ్లు కళకళ లాడుతున్నాయి.ఇప్పుడు వీళ్లకు మళ్లీ అక్షరాలు అలవాటు చెయ్యాలి.గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద పిల్లలకు చదువు మళ్లీ కొత్తగా కన్పిస్తుంది.వీళ్ళను మళ్లీ చదివిద్దాం.ఈ  తరాన్ని పునర్నిర్మిద్దాం.ఆ సంకల్పంతోనే తోపుడుబండి ఇప్పుడు అక్షరయజ్ఞం ప్రారంభించింది.బడిబడికి తోపుడుబండి అంటూ బడిబాట పట్టింది.ముందుగా సింగిల్ టీచర్ ప్రైమరీ స్కూల్స్ ని లక్ష్యంగా చేసుకొని పని ప్రారంభించింది.21 స్కూల్స్ ని ఎంచుకొని ముందుకు సాగుతోంది.
  ఈరోజు ఖమ్మంజిల్లా కల్లూరు మండలంలోని గోపాల దేవబోయిన పల్లి,ఎర్రబోయిన పల్లి,విశ్వనాధపురం,బత్తులపల్లి గ్రామాల్లోని ప్రాధమిక పాఠశాలలను తోపుడుబండి సందర్శించింది.అక్కడి పిల్లలకు నోట్ బుక్స్ ,వర్క్ బుక్స్,కాపీ రైటింగ్ బుక్స్ అందించింది.ఈ కార్యక్రమంతో అక్షరయజ్ఞానికి శ్రీకారం చుట్టింది.పిల్లలతో,టీచర్లతో మాట్లాడింది.పిల్లలకు ఏమేం కావాలో తెలుసుకుంది.
 ఇప్పుడు వీళ్లకు పలకలు,బలపాలు,కాపీ రైటింగ్ బుక్స్,పెన్సిళ్లు,ఏరేజర్లు, నోట్ బుక్స్,పెన్స్ వీలైతే స్కూల్ బ్యాగ్స్ కావాలి.మొత్తం 21 స్కూల్స్ సగటున 20 నుంచి 60 మంది వరకు పిల్లలున్నారు.ఈ కార్యక్రమం విజయవంతం అయితే ప్రైమరీ,అప్పర్ ప్రైమరీ,హై స్కూల్స్ పిల్లల వరకు కూడా మనం చేరుకోవచ్చు. ఇప్పుడు మన దృష్టి మొత్తం పల్లెలు పిల్లలు పుస్తకాలు,చదువులు అనే అంశం మీదే కేంద్రీకరించాం.మీ అందరి సహకారం కోరుతున్నాం.
ప్రేమతో...మీ తోపుడుబండి సాదిక్.
9346108090,7330033330
కామెంట్‌లు