ఎర్రని రాజ్యం. నల్లని సింహాసనం. ఒక రాజు ఎక్కితే ఒక రాజు
దిగుతాడు.
జవాబు దోసెలు.
మా తాత రెండు ఎద్దులు జతలు కొన్నాడు. 1 ఇ ముందుంటుంది 1 వెనక ఉంటుంది.
జవాబు చెప్పుల జత.
పొడుగాటి పొగరోడికి మెడ నిండా కాయలు.
జవాబు తాటి చెట్టు.
పండు కానీ పండు.
జవాబు విభూతి పండు.
శ్రీ పేరుతో ప్రసిద్ధి పొందిన క్షేత్రం. మూడు ప్రాణులను బలిగొని ముక్తిని ప్రసాదించి న క్షేత్రం.
జవాబు శ్రీకాళహస్తి.
చంచాను కరుచుకుని ఉంటుంది. నిత్యం కాళ్లు క్రిందికి వేలాడ తీస్తుంది.
జవాబు సేమియా.
ఇంటికి కాపలా కాస్తుంది కుక్క కాదు. పట్టుకొని వేలాడుతుంది పండు కాదు.
జవాబు తాళం.
అంగడిలో పెట్టి ఇ అమ్మేది కాదు. తక్కెట్లో పెట్టి తూచేది కాదు. అది లేకుంటే మనిషే కాదు.
జవాబు మనసు.
పట్టుకొని పెట్టుకునేది. పెట్టుకొని చూసుకునేది. చూసుకుని మురిసి పోయేది.
జవాబు బొట్టు అద్దం.
ఇంటి రంగు ఎరుపు. దాని లోపల తెలుపు. తెలుగులో నల్లని చీమలు.
జవాబు యాపిల్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి