సైకిళ్ళ చరిత్రను చూస్తే మొట్టమొదటి మోడల్స్ ని velocipedes అనేవారు. మొదటి సైకిళ్ళను ఫ్రాన్సులో తయారుచేశారు. కానీ ఆధునిక రూపం మాత్రం ఇంగ్లండులో తయారైంది.
మొట్టమొదటగా కమర్షియల్ గా అమ్మిన సైకిల్ బోన్షేకర్. దీని బరువు దాదాపు ఎనబై కిలోలు. 1868లో ప్యారిస్ నగరంలో ఇది వాడుకలోకి వచ్చింది.
అనంతరం దాదాపు వందేళ్ళకు చైనాలోనూ సైకిళ్ళు ప్రవేశించాయి.
ఇంగ్లండులో ఇప్పటికీ సైకిళ్ళ వాడకం మన దేశం కన్నా ఎక్కువగానే ఉందట. నెదర్లాఃడ్స్ లో సైకిల్ తొక్కే వారి సంఖ్య అధికమే.
సైకిళ్ళల్లో BMX మోడల్ ని 1970లలో తయారుచేశారు. వీటిని సైకిల్ రేసే లలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
1817లో జర్మనీకి చెందిన Karl von Drais
తయారు చేసిన సైకిల్ ని డాండీ హార్స్ అనే వారు.
సైకిల్ వాడుకలోకొచ్చిన మొదటి నలబై ఏళ్ళల్లో మూడు ప్రధాన సైకిళ్ళు - బోన్షేకర్ (ఫ్రాన్స్). పెన్నీ ఫార్తింగ్ (ఇంగ్లీష్ వారిది). రోవర్ సేఫ్టీ సైకిల్.
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి పొందిన సైకిల్ రేసే టూర్ డి ఫ్రాన్స్. ఇది 1903 నుంచి ఇప్పటికీ ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది మూడు వారాల పోటీ. ప్రపంచ వ్యాప్తంగా అనేకులు ఈ పోటీలలో పాల్గొంటారు.
సైకిల్ అనే పదం ఫ్రెంచ్ పదం “bicyclette”.
నుంచి పుట్టింది. అంతకుముందు సైకిల్ ని velocipedes అని అనేవారు.
సైకిల్ చరిత్రలో 1887 లో John Boyd Dunlop తయారు చేసిన సైకిలు ఎంతో ప్రసిద్ధి పొందింది.
సైకిలుపై ప్రపంచ యాత్ర చేసిన మొదటి వ్యక్తి ఫ్రెడ్ ఎ. బిర్చ్ మోర్. ఆయన 25,000 మైళ్ళు సైకిల్ మీద ప్రయాణం చేశాడు. అతను ఈ ప్రపంచ యాత్రలో 15,000 మైళ్ళు పడవపైన ప్రయాణించాడు. అతను తన యాత్రలో ఏడు సెట్ల టైర్లను ఉపయోగించాడు.
మొట్టమొదటి Mountain Bikesని 1977 లో తయారు చేశారు.
అమెరికాలో 400 సైక్లింగ్ క్లబ్బులున్నాయి.
న్యూయార్కులో ఇప్పటికీ పది శాతం మంది తమ కార్యాలయాలకు సైకిళ్ళపైనే వెళ్తుంటారు.
ఇలా ఎన్నో ముఖ్యాంశాలతో కూడిన సైకిల్
ఓ యాభై సంవత్సరాల క్రితం దాకా ప్రపంచంలో మనిషికి అవసరాలను తీరుస్తూ వచ్చింది. ఒక్కొక్కప్పుడు ఈ సైకిలుని ఎవరైనా దొంగిలించుకుపోతే ఆ కుటుంబం ఎంతలా బాధపడిందోనని కొన్ని కథలూ రాయబడ్డాయి.
ఒకానాకప్పుడు సైకిల్ కొనడమనేది ఓ లక్ష్యంగా ఉండేది. కొందరికైతే ఆ ఆశ తీరేదికాదు. నేను రెండు వందల రూపాయలకు రత్నంగారనే పెద్దాయన దగ్గర ఓ సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనడానికి ఆరేడు నెలలు డబ్బులు కూడబెట్టాను.తర్వాతి రోజుల్లో మా పెద్దన్నయ్య కొడుకు హేమంత్ తన బిఎస్ఎ సైకిల్ నాకిచ్చినప్పుడు ఎంత ఆనందమేసిందో. ఆ సైకిల్ మీదే మా అబ్బాయిని కూర్చోపెట్టుకుని స్కూల్లో దింపొచ్చిన రోజులున్నాయి. ఈ సైకిల్ చాలా కాలమే వాడాను. మద్రాసు నుంచి హైదరాబాదుకి మకాం మార్చినప్పుడు ఆ సైకిల్ అక్కడే మరొకరికి ఇచ్చేసాం.
నాకు తెలిసినవి అట్లాస్ సైకిలూ హీరో సైకిలు...అలాగే మరొక సైకిల్ ఉండేది. ఆర్ తో మొదలవుతుంది. పేరు గుర్తు రావడం లేదు.
తొంబై దశకంలోనూ చాలా మంది యువకులు సైకిల్ నే ఉపయోగించేవారు. అప్పట్లో అదొక గొప్ప వాహనం.
కాలక్రమంలో మోటర్ సైకిల్ వాడుకలోకొచ్చేసరికి సైకిల్ మరుగునపడింది. ఇటీవలే మా ఎదురింట ఓ సెక్యూరిటీ అతను అద్దెకు దిగారు. అతను సైకిల్ మీదే డ్యూటీకి వెళ్ళొస్తుంటాడు. మా అపార్టుమెంటులో పక్క వాటాలో ఒక సైకిల్ ఉంటే తొక్కాలనిపించి ఒక అయిదు నిముషాలు తొక్కి ఆ ఆనందం తీర్చుకున్నాను.
ఈ కాలంలో అరుదైపోయిన ఈ సైకిలే శారీరక వ్యాయామానికి పనికొస్తుందని కొందరి మాట.
ఐరోపా దేశాలలో ఇప్పటికీ చాలా మంది సైకిలునే తమ ప్రధాన వాహనంగా ఉపయోగించడానికి ఇష్టపడతారట.
ఒక్కొక్కప్పుడు జబ్బుపడ్డ పెద్దవారిని సైకిలుపై కూర్చోపెట్టుకుని ఆస్పత్రికి తరలించిన సంఘటనలున్నాయని చరిత్ర పుటలు తిరగేస్తే తెలుస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి పది కోట్ల సైకిళ్ళు తయారవుతున్నాయి. ఈ సైకిల్ వాడకం వల్ల ఏటా తొంబై కోట్ల లీటర్ల పెట్రోల్ ని ఆదా చేసినట్లవుతుందని ఓ గణాంకం చెప్తోంది.
పర్యావరణ పరిరక్షణకోసం కాలుష్య నివారణకోసం అభివృద్ధి చెందిన అనేక దేశాలలో సైకిల్ నే ఉపయోగిస్తున్నారు.
ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్ వంటి దేశాల రాజధానులలో సైకిల్ తొక్కేవారికోసం ప్రత్యేక రహదారులను ఏర్పాటు చేయబడ్డాయి.
కానీ మన దేశంలో నలభై శాతం ఇళ్ళల్లో సైకిల్ ఉన్నా ఉపయోగించడంలేదని సర్వేలు చెబుతున్నాయి. సైకిల్ ఉపయోగాన్ని పెంచగలిగితే మొత్తంమీద 1.8 కోట్ల రూపాయలను మిగుల్చుకోవచ్చన్నది గణాంకాల మాట.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి