*అక్షర మాల గేయాలు**సంయుక్తాక్షర గేయం ద- ఒత్తు*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 నంది వర్దనం పూలను చూశారా
ముగ్ధమోహనంగా ఎంత బాగుంటాయో
గార్దభం గొంతు విన్నారా మీరు
శబ్దం ఎంత ఘోరంగా చేస్తుందో
శార్దూలము అంటే తెలియాలంటే
అర్థం కోసం నిఘంటువు వెతకండి
వాగ్దేవి కరుణను పొందాలంటే
వాగ్దానం చేసి బుద్దిగా చదవాలి
శబ్దం చేయక గురువుల పాఠాలు
నిశ్శబ్దంగా మనసుపెట్టి వినాలి

కామెంట్‌లు