నిజాయితీ! అచ్యుతుని రాజ్యశ్రీ


 రామయ్య చిన్న రైతు.ఆఏడు భారీవర్షాలతో పంటనీట మునిగింది.కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.తను కుటుంబంని అనాధగావదలరాదు అని భార్య తో అన్నాడు "నేను పట్నం పోయి కూలీనాలీ చేస్తా. నీవు పిల్లలను చూసుకుంటూ ఉండు." ఆరోజు పొద్దున్నే బస్సు లో బైలుదేరాడు. ఓ గంట తర్వాత  ఓ వ్యక్తి బస్సు ఎక్కాడు. బొద్దుగా ఒడ్డు పొడుగు తో చేతికి రెండు ఉంగరాలు బంగారు గొలుసు వాచీ మెళ్ళో గొలుసు తో డబ్బు న్న మారాజులా కనపడ్డాడు.బాగా ఆయాసపడుతున్నాడు.రామయ్య తనసీటులోంచి లేచి "అయ్యా!మీరు కూచోండి "అనగానే ఆయన ధబ్ మని కూలబడ్డాడు.

 రామయ్య కూచున్న సీటులోనే ఓ గర్భవతి కూచుంది.ఆమె పక్కనే కూలబడిన అతను కాసేపటికి నిద్రలోకి జారాడు.రామయ్య డ్రైవర్ వెనక ఉండే రేకుడబ్బాపై కూచున్నాడు. యధాలాపంగా చూసిన రామయ్యకి ఓ దృశ్యం కంటపడింది. ఆ స్త్రీ  ఆపెద్దమనిషి జేబు లోని  పర్సు  లాగేసి తన చీరె కొంగులో చుడుతుండగా రామయ్య పెద్దగా అరిచాడు "ఏమ్మా!ఆ పర్సు.."అంతే జనమంతా అటుచూశారు.ఖంగారు గా ఆమె పర్సు ని కిందకి జార్చింది."సార్!మీ పర్సు ని ఈమె తీసి కింద పడేసింది"ఆవ్యక్తిని తట్టి లేపాడు ."ఏందయ్యోయ్!నీవేగా ఆపర్సుని  తీసి నీకు ఇమ్మన్నావు?"దబాయించింది."ఏవమ్మా!ఆరైతన్న  డ్రైవర్ దగ్గర కూచున్నాడు"అని గద్దించారు చుట్టుపక్కల సీట్లలోని వారు. ప్రయాణీకులు అంతా గోల పెట్టడంతో ఆపక్క స్టాప్ లో కండక్టర్ దింపేశాడు.అంత్యనిష్ఠూరం

కంటే ఆదినిష్టూరం మేలుకదా?ఆవ్యక్తి రామయ్యను తన పక్కన కూచోపెట్టుకుని వివరాలు అడిగాడు. పట్టణం చేరాక ఆయన  అన్నాడు"రామయ్యా! నాషాపులో పనిచేయి.మా ఇంటి ఔట్ హౌస్ లో ఉండు.నీకుటుంబాన్ని తెచ్చుకో"అన్నాడు రాఘవస్వామి."బాబయ్యా!నేను గుమాస్తా పని చేయలేను.చదువుకోలేదు." "సరే తోటపని సరుకులు తేవటంచేయి. నాకొడుకు దివ్యాంగుడు.వాడికి సాయంచేయి.ఇంట్లోనే చిత్రాలు గీస్తాడు." ఆరోజు నించి  ఆయన నమ్మిన బంటుగా మారాడు.స్వామి తల్లి  ఎనభై దాటిన వృద్ధురాలు. ఆరోజు  ఇంటి బాధ్యత  రామయ్య కి అప్పజెప్పి స్వామి  భార్య తో పెళ్ళికి వెళ్లాడు.అవ్వగారు కాస్త  ఖంగారు పెట్టడంతో ఇరుగుపొరుగు సాయంతో  డాక్టరు ని పిలిపించాడు.రాత్రి పది దాటాక ఇల్లు చేరిన స్వామి దంపతులు జరిగిన దంతా తెలుసుకున్నారు.దీనంగా బామ్మ దగ్గర కూచున్న కొడుకు  వివరించి చెప్తుంటే  వారి గుండె  కరిగినీరైంది."రామయ్యా!ఆదేవుడు పంపిన దూతవి.నాకొడుకుని అమ్మని కంటికి రెప్పలా కాపాడుతున్నావు.నీ కుటుంబాన్ని తెచ్చుకో.నాఇద్దరు పిల్లలతో పాటు  నీపిల్లలను చదివిస్తా"స్వామి మాటలకు జలజలా కన్నీరు కార్చాడు రామయ్య. నిజాయితీవారికి దేవుడు తప్పక సాయపడతాడు.

కామెంట్‌లు