వారి వారి జీవితాల పై ఉంటే బాగుపడుతుంది ఈ సమాజం ...
అవసరం అని బ్రతిమాలి ,అవసరానికి వాడుకొని
అవసరం తీరాక ఆడుకోడం ఆపేస్తే బాగుపడుతుంది ఈ సమాజం ...
ప్రక్క వాడి ఏడుపు చూసి నవ్వడం
మానేస్తే బాగుపడుతుంది ఈ సమాజం....
పైసా పై వున్న పైశాచికత్వం
తగ్గితే బాగుపడుతుంది ఆ సమాజం....
నిజానికి నీడకు తేడా తెలిస్తే బాగుపడుతుంది ఈ సమాజం ....
పైకి ఎదిగే వాడిని కిందికి అణగ ద్రొక్కడం
మానేస్తే బాగుపడుతుంది ఈ సమాజం....
అమ్మానాన్న చనిపోయాక ఆడంబరంగా సాగనంపడం కన్నా
సజీవంగా వున్నపుడు బుక్కెడు బువ్వ పెడితే బాగుపడుతుంది ఈ సమాజం ...
నిజాన్ని చూపేలోపే అబద్ధం అందంగా అలంకరించుకొని
ముందుకొస్తుంది అనే సత్యాన్ని తెలుసుకుంటే బాగుపడుతుంది ఈ సమాజం...
ఉన్న పది రూపాయలలో 1 రూపాయి లేని వాడికి సాయం చేస్తే
అది మంచితనం అని తెల్సుకుంటే బాగుపడుతుంది ఈ సమాజం...
ఒక వేలితో ఎదుటి వ్యక్తి తప్పును చూపేటప్పుడు
మిగతా వేళ్లు తన వైపే చూపుతున్నాయని
తమ తప్పుని తెలుసుకుంటే బాగుపడుతుంది ఈ సమాజం ...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి