కలం సంగతులు:-- యామిజాల జగదీశ్

 ఒక సాధారణ పెన్నులో సిరా నింపినప్పుడు సగటున 45,000 పదాలు రాస్తుంది. (అంటే ఇంక్ తీరేవరకు). 
1938లో మొట్టమొదటి బాల్ పాయింట్ పెన్ను వాడుకలోకొచ్చింది. దీనిని కనిపెట్టిన అతను హంగేరియన్ జర్నలిస్టు లాస్జియో బైరో. అయితే బాల్ పెన్ను తయారీకి పేటంట్ హక్కులు పొందినతను జాన్ లౌడ్. 1888లో అతనికి ఈ హక్కులు కల్పించారు.
మొట్టమొదటి ఫౌంటెన్ పెన్నుని న్యూయార్క్ ఇన్సూరన్స్ ఏజెంట్ లూయిస్ ఎడ్సన్ వాటర్మాన్ 1883లో తయారుచేశాడు. 1884లో అతనికి పేటంట్ హక్కులు ఇచ్చారు.
నానో ఫౌంటన్ ప్రోబ్ అత్యంత పొట్టి పెన్నుగా రికార్డు పుటలకెక్కింది. ఈ పెన్నుతో కేవలం నలభై లైన్లు మాత్రమే రాయడం కుదురుతుంది.
వెయ్యేళ్ళ క్రితం ఈకలతోనే రాసినట్టు చరిత్ర పుటలు చెబుతున్నాయి. క్రీ.శ. 700లో మొదటిసారిగా ఉపయోగించారట.
ఇప్పటికీ బంగారు పాళీ (నిబ్బు)లతో తయారు చేసిన ఫౌంటన్ పెన్నులున్నాయి. 
1943 జూన్ నెలలో బైరో, అతని సోదరుడు జార్జ్ (కెమిస్ట్) కలిసి కమర్షియల్ మోడల్స్ లో పెన్నులు తయారు చేశారు. ఈ పెన్నుల పేరు బైరో పెన్స్. బైరో పెన్నులకుగానీ బాల్ పాయింట్ పెన్నులకుగానీ మంచి గిరాకీ ఉండేది.
బైరో పెన్నుల హక్కులను బ్రిటీష్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. రాయల్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వాడటానికి వీలు కల్పిస్తూ ఈ హక్కులు కొనుక్కుంది.
2949లో Marcel Bich మొట్టమొదటిసారిగా ఖరీదైన బాల్ పాయింట్ పెన్నుని ప్రవేశపెట్టింది. దాని పేరు 
BIC.
1963లో  ‘Hi-Liter’ పెన్ను వాడుకలోకొచ్చింది. దీనిని మసాచుసెట్స్ లో తయారుతేశారు.
1910లో మొదటిసారిగా మార్కర్స్ పెన్నులు తయారయ్యాయి. లీ న్యూమాన్ ఈ రకమైన పెన్నులకు పేటంట్ హక్కులు పొందారు.
1952లో మ్యాజిక్ మార్కర్ పెన్నుని తయారు చేసింది సిడ్నీ రోజెన్తల్. 
1984లో జెల్ ఇంక్ కనుగొన్న సంస్థ సకురా కలర్ ప్రాడక్ట్స్ కార్పొరేషన్. ఇది జపాన్ సంస్థ. ఒసాకా అనే ప్రాంతంలో ఉంది. జెల్ పెన్నులలో రకరకాలవి తయొరు చేసిన ఘనత ఈ సంస్థకే దక్కింది.
ఇలా సుదీర్ఘ చరిత్ర కలిగిన పెన్నంటే నాకిప్పటికీ ఇష్టం. అందులోనూ ఫౌంటన్ పెన్నులంటే వల్లమాలిన ప్రేమ. ఇప్పటికీ పెన్నుతో కొన్ని మాటలైనా రాస్తేతప్ప తోచదు. పెన్ను, పుస్తకాలు నా శ్వాస. 

కామెంట్‌లు