ఆమెది కమ్మని గాత్రం. ప్రస్తుతం ఆరోగ్యం బాగా లేక బెంగళూరు లో మేనమామ కొడుకు దగ్గర ఉన్నారు. ఫోన్ ద్వారా ఆమె వివరాలు సేకరించాను.
కుమారి ఎం.పద్మినీకాంత ఎం.ఎ.తెలుగు. ఎం.ఫిల్ తిరుపతి లో చేశారు. రాయలసీమ కవి ఎమ్మనూరు చినవెంకటరెడ్డి పై పరిశోధన అది.గైడ్ తిరుపతి నాగయ్య గారు. పి.హెచ్. డి. ఉస్మానియా యూనివర్సిటీలో నిడమర్తి నిర్మలాదేవి పర్యవేక్షణలో చేశారు. దాని అంశం "పుట్టపర్తి వి:శ్వనాథల గేయకావ్యాలు తులనాత్మక పరిశీలన ".తిరుపతి ఎస్.వి.కాలేజి నుంచి మ్యూజిక్ విశారద పాసైంది.బి.ఇడి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో చేశారు.
తన జీవితం గురించి ఆమె మాటల్లో "నేను కర్నూలులో పుట్టాను. పుట్టిన వారంకే నేను పుట్టు గ్రుడ్డిని అని తేలిపోయింది. అమ్మా నాన్నలకు తొలి సంతానం నేనే. నాన్న ప్రైవేట్ ఉద్యోగి.ఆవుల సాంబశివరావు గారి పరిచయం తో6ఏళ్ళ నన్ను గుంటూరులోని అంధపాఠశాల హాస్టల్లో చేర్పించాడు నాన్న. అది ప్రైవేట్ ది.ఒక మూడు నాలుగు నెలలుండి ఏడ్చి ఇంటికి వచ్చేశాను.అక్కడ అంతా అమ్మాయిలే.కానీ ఎవరితో కలిసేదాన్ని కాదు. హైదరాబాద్ కో ఎడ్యుకేషన్ స్కూల్ లో 1నుంచి 4దాకా చదివాను. 1970 ..71లో కడపలో 5దాకా చదివి ఆపై ప్రైవేట్ గా నాన్న సాయంతో మెట్రిక్ పాసైనాను.స్క్రైబ్ సాయంతో పరీక్షలు పాసైనాను. నేను బ్రెయిలీ లిపిలో రాసుకునే దాన్ని. నాకు ఉన్న ఒకేఒక తమ్ముడు తన8వ ఏట పోయాడు. నా 14ఏళ్ళ వయసులో అమ్మ కూడా దిగులు పడి కాలం చేసినది.నాన్నమ్మ చూసుకునేది.ఆతరువాత బాబాయిల దగ్గరకు వెళ్లిపోటంతో నేను నాన్న మిగిలాం. ఆయన వంట చేసి పసిపాప లాగా చూసుకున్నారు. నాన్న సలహాపై టి.టి.సి.చేసి ఉర్దూ మీడియం చట్టాబజార్ ఛాదర్ ఘాట్ హైస్కూల్ లో తెలుగు పండిట్ గా చేరాను.పటన్ చెరుప్రభుత్వ జడ్.పి.స్కూల్ నించి సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ గా రిటైరయ్యాను.నాన్న 2006లో పోయారు.ఒంటరిగా బ్రతుకు పోరాటం సాగిస్తున్నాను.రేడియో ఆడిషన్ పాసై 5..6 ప్రోగ్రాంలు ఇచ్చాను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో.హిందీ ప్రవీణ పాసైనాను. ఎన్ని డిగ్రీలు ఉన్నా కనుచూపు లేకున్నా బాల్యంలోనే అమ్మా నాన్నలను పోగొట్టుకున్న బాధ ఎవరూ తీర్చలేనిది.చూపులేకున్నా టి.వి.రేడియో తో కాలక్షేపం చేస్తాను.వంట కరెంటు హీటర్ కూడా ఉపయోగిస్తాను.మంచి స్నేహితురాలు అక్క గంగరాజు పద్మజ. మా మేనమామ కొడుకు వాసు అతని భార్య నాకు రెండు కళ్ళు. బెంగళూరు లో సాఫ్ట్వేర్ అయిన ఆదంపతులు నాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తాను"అని ఆమె తన అనుభవాలు వివరించారు. త్వరగా ఆమె కోలుకోవాలని ఆదైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
తెలుసు మాకు వెలుగేదో!..: ఎం.పద్మినీకాంత : -సేకరణ : --.అచ్యుతుని రాజ్యశ్రీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి