పల్లె తల్లి గొప్పది:--గద్వాల సోమన్న
పల్లె చూడ అందము
పసి పిల్లల చందము
కల్గించు పరవశము
పొంగిపొర్లు హృదయము

ఆత్మీయత  పెంచును
అనురాగం పంచును
అమ్మలాగ చూడును
ఆనందం విరియును

పల్లె మనసు శ్రేష్ఠము
పరిమళించే గంధము
పెనువేయును బంధము
ప్రేమలకూ మూలము

పల్లె తల్లి వంటిది
పల్లె మనసు గొప్పది
స్వార్ధగుణము లేనిది
సాయపడు స్నేహమది


కామెంట్‌లు