26.ప్రేమ!
వ్రాసే ప్రేమలేఖ!
త్వరలో వేసే శుభలేఖ!
మాంగల్యానికి మహాముడి!
దాంపత్యానికి నారుమడి!
27.ప్రేమ!
"కులం" దాటుతుంది!
"మతం" మాయమవుతుంది!
"మానవత్వం" నిలుపుతుంది!
"దైవత్వం" చాటుతుంది!
28. ప్రేమ!
"రహస్యం" తెలిసొస్తే!
జగమంతా ప్రేమమయం!
జీవితమంతా రసమయం!
ప్రతిక్షణం ఆనందవీక్షణం!
29.ప్రేమ!
తేలని లెక్క!
వదలని తిక్క!
ఆగని రుణం!
బతుకు పణం!
30. ప్రేమ!
దానికెంతో పొగరు!
అదే దాని పవరు!
లోకమంతా లవ్వరే!
ఉన్నదొక్క లవ్వు నవ్వే!
( కొనసాగింపు)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి