*సాహితీ బృందావన జాతీయ వేదిక**అంతర్జాతీయ శాంతి దినోత్సవ వీడియో కవిత పోటీల విజేతలు*

 సాహితీ బృందావన జాతీయ వేదిక నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారు సంయుక్త ఆధ్వర్యంలో వీడియో కవితా పోటీలు అంతర్జాతీయస్థాయిలో నిర్వహించగా... మహారాష్ట్ర పూణే బొంబాయి మైసూరు బెంగళూరు మలేషియా సింగపూర్ నుంచి కవులు కవయిత్రులు వీడియో కవిత పోటీలలో పాల్గొని విశ్వశాంతి అనే అంశంపై కవితా గానం చేసి శాంతి సందేశం అందించారు
ఈ పోటీలలో 150 వీడియో కవితలు
రావడం జరిగింది.
ప్రతి ఒక వీడియోను కూడా పరిశీలించి లైక్స్ ఆధారంగా విజేతలను ఎంపిక చేయడం జరిగింది.
అంతర్జాతీయ ప్రపంచ శాంతి దినోత్సవం రోజున విజేతల ప్రకటన చేసి ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలకు *విశ్వగురు* బిరుదును సాహితీ బృందావన జాతీయ వేదిక నుంచి ప్రధానం చేశారు.
ప్రోత్సాహక విజేతలను ఎంపిక చేసి e వారికి *విశ్వ ప్రేమిక* *పురస్కారం* అవార్డును సాహితీ బృందావన జాతీయ వేదిక నుంచి ప్రధానం చేశారు.
అంతర్జాతీయ శాంతి దినోత్సవం వీడియో కవిత పోటీల్లో పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు 
పోటీల్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు
సాహితీ బృందావన జాతీయ వేదిక అధ్యక్షురాలు
శ్రీమతి నెల్లుట్ల సునీత నేను సైతం యూట్యూబ్ ఛానల్ దేవరపు ఈశ్వరరావు గారు ఆంధ్ర యూనివర్సిటీ
నేను సైతం యూట్యూబ్ ఛానల్ దేవరపు ఈశ్వరరావు ఆంధ్ర యూనివర్సిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రథమ విజేత 
లక్ష్మీ తమ్మా
ద్వితీయ విజేత
 దాసరి పద్మ
తృతీయ విజేత
 కె.వి .గోపాలాచార్యు
ప్రోత్సాహక విజేతలు 
నాలుగో స్థానం 
కొణతం చైతన్య కుమార్
ఐదో స్థానం
 మట్టే రవీందర్
ఆరో స్థానం
 ఉషారాణి
ఏడో స్థానం
 లక్ష్మీ శైలజ ఇందుర్తి
ఎనిమిదో స్థానం
 శాంతిశ్రీ
తొమ్మిదో స్థానం 
గంగా జమున దడివే
పదో స్థానం 
ఎస్ .రత్న లక్ష్మి
సాహితీ బృందావన జాతీయ వేదిక
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురుబ్రహ్మ బిరుదులు
విద్యారంగంలో విశేష కృషి చేసిన  30 మందికి అందజేయడం జరిగింది
 అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని కవితా పోటీలు నిర్వహించి అక్షర క్రాంతి పురస్కారాన్ని అందజేసారు
బాలాజీ జయంతి పురస్కరించుకొని
నిర్వహించి కాళోజీ సాహిత్య పురస్కారం
కవులకు ప్రధానం చేశారు.
ఆయా సందర్భాలను జాతీయ పండుగను పురస్కరించుకుని కవితల పోటీలు నిర్వహించి నూతన కవులను ప్రోత్సహిస్తూ బిరుదులు అవార్డులు పురస్కారాలు ప్రశంసాపత్రాలు బృందావన జాతీయ వేదిక నుంచి అందజేస్తునందుకు సాహిత్య సేవలు అందిస్తున్న
నెల్లుట్ల సునీతను ప్రముఖులు సాహితీవేత్తలు అభినందించారు.
కామెంట్‌లు