పుస్తకంతో చెలిమి చేయర కన్నా
మస్తకానికది మంచి నేస్తం చిన్నా
బస్తాల కొద్ది తెలివి ఇస్తుంది నాన్నా
ఆప్తులెందరినో పరిచయం చేస్తుంది కన్నా
ఇస్తుంది అందరిలో గౌరవం చిన్నా
పెద్దల జీవిత గాథలు పఠిస్తే నాన్నా
తెలుస్తాయి ఎన్నో విషయాలు కన్నా
సూక్తి గాథలు చక్కగ చదవరా చిన్నా
సమస్త విలువలను తెలుసుకోరా నాన్నా
పాటిస్తే మంచి పేరు వస్తుందిర కన్నా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి