46.ప్రేమ!
ఆరని దీపం!
ఆనంద రూపం!
అద్భుత భావం!
అమృత స్వభావం!
47.ప్రేమ!
ఆచారం కాదు!
ప్రచారం అవసరం లేదు!
ఓ దివ్యభావ సంచారం!
దైవీయ సాక్షాత్కారం!
48.ప్రేమ!
ప్రేమ నిండిన కనులు!
తరగని కోలార్ గనులు!
అవే నిజమైన సంపదలు!
అన్యమైనవన్నీ ఆపదలే!
49.ప్రేమ!
పుష్ప తావి!
రసాల మావి!
పిల్లనగ్రోవి!
భువి లో దివి!
50.ప్రేమ!
మలయమారుతం!
గంగాస్నానం!
హిమాలయనివాసం!
ప్రశాంత జీవనం!
( కొనసాగింపు)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి