ఆత్మీయత వుంటే....
వృద్ధాశ్రమాలుండవు.
అందరిలోనూ ఉంటుంది.
కానీ..... ఆత్మీయత
కొందరి పైనే ఉంటుంది.
కొందరికే సొంతం.
కొనలేనిది.
కొదువైనది.
అరుదైనది.
వెలలేనిది.
విలువైనది ఆత్మీయత
విశాల విశ్వంలో....
మున్ముందు "ఆత్మీయతానుబంధాలెక్కడా ?"
అని వెతుక్కోవాల్సి వస్తుందేమో?
పెంపకంలో లోపమా....?
ఈ స్వార్థపు సమాజములో
మన అనే బంధాలు
దొరికేనా....?
నీవు అన్న పరాయి తత్వమే కనిపిస్తుంది.
బంధాలూ,బంధుత్వాలూ డబ్బు వైపే మొగ్గు చూపుతున్నట‌్లున్నాయి.
అంతా నటనమయమే.
పెడితే పెండ్లి కోరడం
పెట‌్టకపోతే.......
ప్రేమ,ఆప్యాయతలు అధఃపాతాళానికి
వెళ్ళిపోతున్నట‌్లున్నాయి.
అమ్మానాన్న ప్రేమానురాగాలు తప్ప
ఏ బంధమైనా దొరకొచ్చేమో గాని
రక్త సంబంధాలను కోల్పోతే మాత్రం ఎక్కడా దొరకవు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి