*అక్షర మాల గేయాలు**సంయుక్తాక్షర గేయం య- ఒత్తు*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 రమ్యమైన మన దేశం ఎంతో గొప్పది
సత్యం ధర్మం విలసిల్లిన సహన దేశమిది
పురాణేతిహాసాల పుణ్యభూమిది
అన్యాయాన్ని ఎదిరించిన శౌర్య ధరణిది
ధైర్యసాహసాల మహిళలేలిన ధరిత్రిది
సభ్యత సంస్కారానికి నిలయమిది
కులమతాల సమైక్యతా పుడమిది
ఐకమత్యారాగం ఆలపించే అవనిది
దేదీప్యమానంగా వెలుగొందిన దివ్యభూమిది
మాన్యులెందరో జన్మించిన మహితలమిది

కామెంట్‌లు