చక్ర పొంగలి. తాటికోల పద్మావతి గుంటూరు.

 ప్రతిరోజు సాయంకాలం రాముల వారి గుడి లో లో ఆచారి గారు పురాణం చెప్తారు. నైవేద్యానికి తెచ్చిన అర టీ జాంపండు ముక్కలు కోసి అందరికీ ప్రసాదం పంచుతారు. ఒక్కరోజు శనగ గుగ్గిళ్ళు పెడతారు. పిల్లలంతా ప్రసాదం కోసం బాదమాకులు కోసుకొని వస్తారు. పురాణం విన్నా వినకపోయినా ప్రసాదం కోసం పిల్లలంతా చేరుతారు. ధనుర్మాసం రానే వచ్చింది సంక్రాంతి నెల పట్టారు. చీకటితోనే దేవాలయాల్లో గంటలు మోగుతున్నాయి నైవేద్యాలు పెడుతున్నారు. ఆ చలిలో భక్తులెవరు రావటం లేదు పూజారికి పడటం లేదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భజనలు జరపాలని గ్రామస్తులు నిర్ణయించారు. భజన కార్యక్రమం నిర్వహణ బాధ్యతలు పూజారికి అప్పగించారు. పల్లెలో ప్రతి ఇంటికి వెళ్లి భజనకి రావాలని పూజారి కోరాడు. చలికి భయపడ్డ జనం భజనలు కి సరిగా వచ్చేవారు కాదు. ఆందోళనచెంది కుటుంబ సభ్యులతో పాటు గుడి కార్యకర్తలతో తన బాధను పంచుకున్నాడు.
వారిలో ఒకరికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.
మరునాడే అందరి ఇళ్లకి వెళ్లి ధనుర్మాసం వచ్చింది చక్ర పొంగలి నివేదన అందరూ భజనకు రావలసినదిగా పిలిచాడు. తెల్లవారింది చీకటితోనే చలిగిలి పట్టించుకోకుండా జనం పరుగులు తీశారు వణుకుతూనే గుడికి ఎగబడ్డారు. ఎన్నడూ లేని విధంగా భక్తి పారవశ్యంతో పాటలు పాడారు భజనలు చేశారు అభిమానులు తందాన తాన పలికారు. భజన తరువాత గుళ్లో పెట్టే తీయటి నెయ్యితో చేసిన చక్ర పొంగలి అందరిని నోరూరించింది. ఆకులు పట్టుకొని వరుసగా నిలబడ్డారు వేడివేడి చక్ర పొంగలి ఆకుల్లో పెడుతుంటే ఆవురావురుమంటూ తిన సాగారు. రేపు కూడా ధనుర్మాసపు నైవేద్యం పులిహోర అని చెప్పగానే అందరూ సంతృప్తికరంగా ఇళ్లకు వెళ్లారు మరుసటి రోజు చీకటితోనే రాముల వారి గుడి దగ్గరికి పులిహోర కోసం భజనలు చేసే భక్తులు చాలా మంది వచ్చి చేరారు. దేవుడి ప్రసాదం ఎంత కమ్మగా ఉంటుందో అందుకోసం అయినా భక్తులు వస్తున్నారు. ఇలాగే నెలంతా ధనుర్మాసం గడిచిపోయింది.

కామెంట్‌లు