మన తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ మనసా వాచా కర్మణా రాజర్షి. మానవోత్తముడు.క్లుప్తంగా మాట్లాడుతూ చాలా సాదాసీదా జీవితం గడిపాడు. విద్యార్ధిగా ప్రతిభాశాలి. క్రమశిక్షణకు మారుపేరు. చదువు పై మనసు లగ్నం చేస్తూ శీలరక్షణ(క్యారెక్టర్)గావించుకుంటూ ఆదర్శ విద్యార్ధిగా నిలిచాడు. సరిగ్గా పరీక్షలముందు మలేరియా కి గురైనాడు. వైద్య సౌకర్యాలు లేని రోజులవి."ఈ ఏడాది పరీక్షలు రాయకు" అని ఇంటాబైట అంతా సలహా ఇచ్చారు. ఆరోజుల్లో ఏఒక సబ్జెక్టు లో ఫెయిలైనా మళ్ళీ అన్ని పరీక్షలు రాయాలి.ఆఏడాది అంతా అలా ఇంట్లో కూచోవాలి."నేను అన్ని సబ్జెక్టులు పాఠాలు క్షుణ్ణంగా చదివాను.తప్పక పరీక్షలు రాసి పాస్ అయితీరుతాను."నీరసంగా ఉన్నా దృఢంగా అన్నాడు ఆబాలుడు. ఆరోజు పరీక్షా ఫలితాలు తెల్పారు.అందులో ఈయన పేరు లేదు. "నీవు ఫేల్ అయ్యావు" అన్న మాష్టారుతో "లేదు..నేను పాస్ అయితీరుతాను. ఏడాది అంతా క్లాస్ లో పాఠాలు శ్రద్ధగా విని చదివాను. నేను పాస్ అయితీరుతాను."వాదించాడు."నీవు ఇంటి కెళ్ళు.మేము తర్వాత వెరిఫై చేస్తాం "అని స్కూల్ వారు బుజ్జగించినా అక్కడే బైఠాయించాడు."నారిజల్ట్ తేలేదాక ఇక్కడ నుంచి కదలను"ఆయనకు 50రూపాయల ఫైన్ వేసినా బెదరలేదు. బడిలో గందరగోళం ఏర్పడింది. ఆఖరికి అది ఆఫీస్ గుమాస్తా చేసిన పొరపాటు గా తేలింది. క్లాస్ ఫస్ట్ వచ్చాడు రాజెన్ బాబు.అదీ ఆయన ప్రతిభ వ్యక్తిత్వం దీక్ష.తొలి భారతరాష్ట్రపతిగా పదవికే వన్నెతెచ్చాడు.ఆస్తమా వ్యాధి తో జీవితాంతం బాధ పడ్డారు.
సాదాసీదా బాబూజీ! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి