ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా గురువారం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలవావిలాలలో "తెలంగాణా భాషాదినోత్సవం" ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ కొండూరు నాగయ్య గారు కాళోజీ చిత్రపటానికి మాలాంకరణచేశారు.ప్రముఖ కవి,గణితోపాధ్యాయుడు శ్రీ అడిగొప్పుల సదయ్య తను కాళోజీ గురించి రాసిన కవితను చదివివినిపించారు.కాళోజీ-తెలంగాణా ఖలేజాబక్క పలచని ఉక్కు పిండంనిక్క పొడచెడి శంఖు కంఠంరుధిర జ్వాలల రుద్ర నేత్రంపిడికిలికి నిలువెత్తు సాక్ష్యం...బడుగు జీవుల అడుగు మడుగులకొత్త జాడలు విత్తుటకు నొకకలము హలముగ కైత పంటనుకూర్చి నూర్చిన కృషీవలుండు...బాస యందలి యాసపైపడిదాడి చేసెడి చెనటిగాళ్ళకుపాడె కట్టియు కాటి కంపినతెలంగాణా నుడికి కాపరి...నిజాం రాజుకు నివురు గప్పిననిప్పు కణికై నిల్చి వెలిగినతెలంగాణా తెగువదనముకుచురుకు మెరుగులు దిద్దినోడు...*కా* లమును, *లో* కమును కలిపియు*జీ* తమును వడబోసి యిచ్చినతెలంగాణా కల్పవల్లికిధీర మానస పుత్ర రత్నం...ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రకిరణ్ ,చంద్రశేఖర్,వెంకట్రాజయ్య, హరీష్,అడిగొప్పుల సదయ్య, చంద్రకళ,ఉషారాణి, పద్మావతీదేవి,హరికృష్ణ,లాలూ ,విద్యార్థులు పాల్గొన్నారు.
వావిలాల ఉన్నతపాఠశాలలో కాళోజీ జయంతి వేడుకలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి