నానీలు ..!! >కవి డా.కె.ఎల్.వి.ప్రసాద్ >హన్మకొండ *

పంజాబ్ రాష్ట్రం 
వార్తలలోకెక్కింది !
మొదటి దళిత
ముఖ్యమంత్రి తో!!

హామీలు ఇస్తాయి
తోకముడుస్తాయి
పవర్ చేతచిక్కాక
తొండిపార్టీలు ...!!

దళితుడంటే 
ఏడుపు-ఎకసక్కెం !
తొక్కిపట్టే గుణం
మారదుఈ లోకం!!

జ్ఞానం..విజ్ఞానం
కాబోదులే ఎవరికీ
ఇకస్వంతం....
అందరిదీ ఆ అదృష్టం!

అధికారం ఎప్పుడూ
ఆ కులాల స్వంతం!
కుదరదు అదిఇక,
ముందు ముందు !!

            ***
కామెంట్‌లు