నానీలు ..!! > కవి :-డా.కె.ఎల్.వి.ప్రసాద్>హన్మకొండ *

 బూతుపురాణం 
రాజ్యమేలుతుంది !
సిగ్గులేనితనం -
రాజకీయమయింది !!
------------------------------
కోర్టులో -
క్రిమినల్ కేసులు ....!
డబ్బుంటేచాలు ..
రాజకీయ రక్షణకవచం !!
----------------------------------
బహిరంగసభల్లో ...
మాటల  దుర్వాసన 
ప్రతిపక్షం అంటే...
చులకనేల ....?
-----------------------------------
పార్టీలమధ్య 
కుమ్ములాట !
ప్రజలను విడదీసి 
చిచ్చుపెట్టే క్రీడ ..!!
-----------------------------------
పదవిదొరికింది ,
నేరస్తుడు ....
నాయకుడైపోయాడు !
పరిపాలన ఎటో ..!!
------------------------------------
పరిపాలనలో మార్పు ..
వాడుకట్టింది ...
వీడుపడగొట్టడం !
ఓ కొత్తదనం!!
--------------------------------------

కామెంట్‌లు
Shyam kumar chagal.nizamabad చెప్పారు…
Dr KLV Prasad గారి కవిత ల లో అన్నీ సమకాలీన రాజకీయ సామాజిక విషయాన్ని అద్దం లో చూడవచ్చు. తనకు అటువంటి స్పృహ వుండటం విశేషం. కవికి అవసరం కూడా.
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
బూతు పురాణం కవిత ద్వారా నేటి రాజకీయ సమావేశాల్లో వాడుతున్న భాష  అలాగే వారు అవలంబిస్తున్న విధానాలను చాలా చక్కగా    తెలియజేశారు .
   ధన్యవాదములు.
బి.రామకృష్ణా రెడ్డి
సికింద్రాబాద్.