రాజ మహేంద్ర వరాన
రాజ రాజ నరేంద్రుని
ఆస్థానమున వెలిగిన!
నన్నయకవిపూనుకొనెను
భారతానూవాదమును
రసజ్ఞతతో తెనిగించి
ఆదికవిగానుమారెను!
వేద వ్యాస ప్రణీతమై
సంస్కృతపదగర్భితమై
అలరెకావ్య మనువదింప
రాజ రాజుకు మోదమై!
"శ్రీవాణిని" భక్తితో
కీర్తించె శ్లోకంతో
(మహా)భారత రచననుచేసి
వెలిగినాడు శోభతో!
మహాభారతమందునను
ఆది సభాపర్వాలను
అరణ్య పర్వశేశాన్ని
నన్నయ అనువదించేను!
అక్షర రమ్యతను రక్తి
నానా రుచిరార్ధ సూక్తి
వీరి రచనన కనిపించు
కథా కలితార్థాయుక్తి!
ప్రౌఢ సమాసాలతో
రస భరితపు శైలితో
శబ్ధశాసనుడైవెలిగె
నన్నయ తనరచనతో!
చాముండికా విలాసము
శ్రీ మాన్యఇంద్ర విజయము
నన్నయకవి రచనలే
ఈ సులక్షణా సారము!
స్వతంత్రపు రచనగాను
చంపూ పద్దతిలోను
కవులకు ఆదర్శమై
నన్నయ రచనసాగెను!
లౌకిక నీతి యుక్తము
శాస్త్రoపు వైధుష్యము
చదివినంతతాకుమదికి
సుధామృతసుమగంధము!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి