వాన జల్లు - బాల గేయం :--- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
జల్లులతో సిరివాన దంచేసిందోయ్ 
కొల్లలుగా కాలువలే ముంచేసిందోయ్ 

చిటాపటా చినుకుల్లో చిందేద్దామా 
పెద్దవాళ్ళ కేకల్లో మానేద్దామా 

వర్షంలో తడిచావా జలుబుచేస్తుంది 
కిటికీలో చూద్దాము మజా ఉంటుంది!

పొట్టివైన బట్టలన్నీ తీసిఉంచాలి 
బట్టలు లేని పిల్లలకి  అందించాలి 

నీరంతా పల్లంకే పోతుందేంటో 
నిజమంతా దేవుడికే తెలుసునేమిటో !!


కామెంట్‌లు