గణితోపాధ్యాయుడు డాక్టర్ అడిగొప్పుల సదయ్యకు సన్మానం


 జి.ప.ఉ.పా.వావిలాల గణితోపాధ్యాయుడు శ్రీ డా అడిగొప్పుల సదయ్యను పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ డి జ్ఞాన సుధాకర్  ఉపాధ్యాయులందరూ సోమవారం  ఘనంగా సన్మానించారు. ఇటీవల మల్లినాథసూరి కళాపీఠం-ఏడుపాయల సంస్థాన్ వారు అడిగొప్పుల సదయ్యకు "కవనశ్రీ చక్రవర్తి" బిరుదు ప్రకటించి, తెలంగాణా సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి శ్రీ డా ఏనుగు నర్సింహారెడ్డి రెడ్డి గారి చేతులమీదుగా ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయప్రాంగణంలో ప్రదానంచేశారు.దాన్ని పురష్కరించుకొని వావిలాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపాధ్యాయులు నాగయ్య, చంద్రకిరణ్,వెంకట్రాజయ్య,చంద్రశేఖర్,శ్రావణ్,చంద్రకళ, హరీష్, పద్మావతి, హరికృష్ణ, మహేందర్ ,వసీమా,లాలూ శ్రీ సదయ్యను శాలువా కప్పి సన్మానించారు. గ్రామ సర్పంచ్  శ్రీమతి జక్కెన శ్రీలత,mptc మర్రి మల్లేశం,SMC చైర్పర్సన్ శ్రీమతి మామిడి శ్రీలత సదయ్యను అభినందించారు.


కామెంట్‌లు