861) సరిగ్గా పట్టు బ్యాటు
అడిగావుగా కోటు
పెట్టుకో హెల్మెటు
ముళ్ళ కంచెను దాటు
862) లేచిపోయింది ఘోడ
వాచి పోయింది దౌడ
పోయిఎక్కాడు ఓడ
గుండెఒకటే దడదడ !
863) డ్రామా వేషం వేయకు
నీవా దోషం చేయకు
కుప్పి గంతులేయకు
అపనింద మోయకు
864) వారిది లవ్ మ్యారేజ్
ఇందా తీసుకో క్యారేజ్
ఖాళీగా ఉంది గ్యారేజ్
చేయి ఇక ఎంకరేజ్ !
865) నీవు మురళిని వాయించు
మారవళిని పిలిపించు
నీ గానం వినిపించు
ఆనందంలో ముంచు !
866) తండ్రి మాట వినాలి
చెడు స్నేహం మానాలి
నీవు పనికి పోవాలి
ఆ పనిలో గెలవాలి !
867) ఉప్పు పప్పు తీసుకరా
డప్పు కప్పు వేసుకరా
చెప్పింది వినాలిరా
చేసి చూపించురా !
868) తప్పింది ప్రమాదం
అయ్యింది జ్ఞానోదయం
ఇదేగా భానోదయం
ఎంతో ఆహ్లాదమయం !
869) బావ కలిసిన శుభవేళ
నీ మోమున ఏది కళ
ఇప్పుడిక నీవు భళ
నాట్యమాడు ఈ వేళ !
870) అమ్మను మరువకురా
డబ్బుందని మురువకురా
అమ్మను చేరదీయరా
ప్రేమను పంచేయరా !
871) ఏం కావాలి నీకు
చేసుకో ఇక సోకు
చేయి చక్కెర పాకు
చెప్పకురా ఇక సాకు !
872) మనం ఏం చేద్దాంరా
రాద్ధాంతం చెయ్యకురా
చెప్పేది వినుకోరా
ముప్పు ఇక తప్పునురా !
873) రావమ్మ ఓ రాధిక
అదిగో నీవేదిక
నీవు చింత చందక
వేయమ్మ చిందిక !
874) ఇది ఎవరు వ్రాసిన కథ
అచ్చేసింది అమ్మ కథ
ముచ్చటైన ముద్దు కథ
మరుపురాని మంచి కథ !
875) మంట బాగ రాజుకుంది
వంట చేసుకోమంది
కొంటెతనం మానమంది
ఒంటరితనం వద్దంది !
876) ఇది రామక్క రాగం
ఆమెకు పట్టింది యోగం
చూసొచ్చే ప్రయాగం
ఇక చేసింది యాగం
877) ఇంత కథ జరిగిందా
అలాఆమె మొరిగిందా
కథ కంచకు చేరిందా
ఆమె పని గోవిందా !
878) దాదాపు పని పూర్తి
చూశావుగా ఇక మూర్తి
పడకు నీవు కక్కుర్తి
అప్పుడు నీవే చక్రవర్తి !
879) కట్టరా తోరణాలు
పెట్టుకో ఆభరణాలు
తెరచు ఇక ద్వారాలు
చేయకు నీవు ఘోరాలు !
880) ఆ సమయం వచ్చింది
అయోమయం హెచ్చింది
తులసి రక్షించింది
దృశ్యం వీక్షించింది !
881) రాసిఇవ్వరా పత్రం
చేయకురా ఆత్రం
పన్నకురా కుతంత్రం
తెరువరా నీ నేత్రం !
గుర్రాల ముత్యాల హారాలు.: గుర్రాల లక్ష్మారెడ్డి ,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి