భలే రాళ్లు - బాల గేయం :-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు

ప్రకృతి పెట్టిన రాళ్లు 
ఇవి 
చక్కని అమరిక గుళ్ళు 
కాలం తాకిడికే నునుపై 
మౌనం పాటించే మునులు!

వందల ఏళ్ళ తరబడిగా 
ఉన్నవి దైవం తీర్పులుగా 
ఎన్నో రకాల నగరాలు
కాలం వొడిలో కలిశాయి !

ఎందుకు ఇలాంటి ఏకాంతం 
సుందర వనాలు మాదిరిగా 
చూడాలి కదా వైవిధ్యం 
రాతి అమరికలే సౌందర్యం!

కామెంట్‌లు