*పోలీసులు*(బాలగేయం):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఖాకీ బట్టలు వేసుకుని
లాఠీ కర్ర పట్టుకుని
డ్యూటీ అన్నా చట్టం అన్నా
శాంతిభద్రతల మాటలువిన్నా
ప్రాణంగా భావించేవారు
దొంగలను దోపిడీదారులను
హంతకులను నయవంచకులను
న్యాయబధ్ధముగ ఖైదుచేసేవారు
ప్రజల బాగు కోసం
తమ ప్రాణాలనైనా
ఫణంగా పెట్టేవారు
పోలీసులండీ పోలీసులు!!

కామెంట్‌లు