జీవితం సుఖదుఃఖాల మయం
ఆత్మవిశ్వాసంతో ఆనందముండిన
సకలం మనకు సంతోషమే
దైవమిచ్చినదియె దక్కు మనకు
కష్ట ఫలితం కలసి వస్తే
విజయాల్లో వెల్గిపోతే
సేవా దృక్పథంలో శ్రేష్టమైతే
పేద వారిలో దైవాన్ని చూస్తూ
సహాయ సహకారాలు అందించి నప్పుడు
విద్యార్థులలో విజ్ఞానం పెంచినప్పుడు
శిష్యులు శ్రేష్టులై ఎదిగినప్పుడు
అందరికీ విజ్ఞానాన్ని పంచుతూ
విద్యను వికసింప జేసినప్పుడు
భావి తరాలను బాగు చేసినప్పుడు
మానసికానందం మహోన్నత మౌను
మానసికానందం:-జెగ్గారి నిర్మల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి