తలకట్టు అక్షరానికందము
తామర పువ్వులు కొందాము
తిరుపతి దేవుని దర్శిద్దాము
తీర్థయాత్రలు చేద్దాము
తుమ్మెద నాదము విందాము
తూనీగ లను చూద్దాము
తృప్తిగ ఆటలు ఆడెదము
తౄ అక్షరాన్ని పలుకుదాము
తెలుగు నేర్చుకుందాము
తేజస్సును పెంచుదాము
తైలయంత్రము చూద్దాము
తొక్కుడు బిల్ల ఆడుదాము
తోబుట్టువులా ఉందాము
తౌతికములా శోభిద్దాము
తుంటరి పనులు మానేద్దాము.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి