*అక్షర మాల గేయాలు**సంయుక్తాక్షర గేయం బ-ఒత్తు*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 అక్బర్ పాదుషా పేరు విన్నారా
బీర్బల్  కథలు తెలుసుకున్నారా
 ఒకానొక సందర్భంలో పాదుషా  
కర్భూజలు చాల తెప్పించాడు
షర్బత్  అందరికీ తాగించాడు
మల్బరీ ఆకులు తినే పురుగేదని
దర్బారులో అందరిని అడిగాడు
సభలో ఎవరు తెలియదన్నరు
పట్టుపురగని  బీర్బల్ చెప్పగ
అక్బర్ ఎంతో ఆనందించాడు
అద్భుతమైన తెలివికి మెచ్చి
దుర్భిణీ బహుమతిగ ఇచ్చాడు


కామెంట్‌లు