బుట్టమీద బుట్ట ,
చంకన చంటిబిడ్డ
బాధ్యతలెత్తుకున్న--
ఆడబిడ్డ ....
కదిలింది
కష్టపడి తెచ్చుకున్న
కందమూలాలతో ...!
అమ్మకం జరిగినప్పుడే
ఆమెకు
ఆకలి గుర్తుకొస్తుంది ,
చంకనున్న బిడ్డ
ఏడుపువిలువ
అర్థమవుతుంది ...
అడుగంటిన నూకలపాత్ర
ఉనికి తెలుస్తుంది !
అందుకే ...
ఆమెఆలోచనలన్నీ
అమ్మకాలగురించే ...!
కొనుక్కునే ....
మారాజుల గురించే ..
కనీసం ఒకపూట
గుక్కెడు గంజిగురించే.!!
కోటివిద్యలన్నీ ....!! >చిత్ర కవిత డా.కె.ఎల్.వి.ప్రసాద్>హన్మకొండ *
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి