*అక్షర మాల గేయాలు**సంయుక్తాక్షర గేయం శ,ష- ఒత్తు*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 బడిలో జరిగాయి నాటిక పోటీలు
ఆదర్శ మహిళ సావిత్రి భాయి
హరిశ్చంద్రుడు కర్షకడు మహర్షి
నాటికలను చక్కగ ప్రదర్శించగ
నిశ్శబ్దంగా పిల్లలు అందరూ
చూసి హర్షంతో చప్పట్లు కొట్టారు
దర్శకత్వం వహించిన బాలలను
గురువులంతా దగ్గరకు పిలిచి
ప్రేమతో వారి తలలను స్పర్శిస్తూ
ప్రశంసల వర్షం కురిపించారు

కామెంట్‌లు