పిల్లులు రోజుకు 16 - 18గంటలు నిద్రపోతాయి. అవి రోజంతా పడుకుని చీకటవడంతోనే బయటికొస్తాయి.
పిల్లులకు ద్రాక్ష, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి పెట్టకూడదు. ఇవి తినడంవల్ల అవి అనారోగ్యంపాలవుతాయి.
పిల్లులు మనిషికన్నా పద్నాలుగు రెట్లు ఎక్కువగా వాసనలను పసిగడతాయి.
మనిషికి 206 ఎముకలుంటే పిల్లులకు 230కిపైగా ఎముకలుంటాయి.
దూకుతున్నప్పుడు, ఇరుకు ప్రాంతాలలో నడుస్తున్నప్పుడు పిల్లులు తమ పొడవాటి తోకలను బ్యాలన్స్ కోసం ఉపయోగిస్తాయి.
పిల్లులకు రాత్రి పూట చూపు బాగుంటుంది.
పెద్ద పిల్లుల గుంపును క్లౌండర్ అంటారు.
జపనీయులకు పిల్లులను పెంచడం మహా ఇష్టం. ఉదయం పూట నిద్ర లేవడంతోనే పిల్లులు కనిపిస్తే ఆరోజు మంచి జరుగుతుందని జపనీయుల నమ్మకం.
పసిఫిక్ సముద్రంలో దక్షిణంగా జపాన్ నీ ఆనుకుని పన్నెండుకుపైగా దీవులున్నాయి. వీటిని పిల్లుల దీవులు అంటారు.
అయితే తషిరోజిమా, ఓషిమా దీవులలో మనుషుల జనాభా కంటే పిల్లుల సంఖ్యే అధికం. ఈ దీవులలో పిల్లులను పెంచడానికి రకరకాల కారణాలు చెప్తుంటారు. ఈ దీవులకు పడవులపై ప్రయాణం చేసి అక్కడి తీరాలకు చేరుకోవడంతోనే మనుషులకు స్వాగతం పలికేవి పిల్లులే. ఈ దీవులలో ఎక్కడంట అక్కడ కనిపించేవి పిల్లులే. వాటిని చూస్తుంటే పిల్లులను మనుషులు పెంచుతున్నారా లేక మనుషులను పిల్లులు పెంచుతున్నాయా అనిపిస్తుంది.
తషిరోజిమా దీవి అంతటా ఒకానొకప్పుడు పట్టు ఉత్పత్తి అధికం. అయితే పట్టుకి బద్ద శత్రువు ఎలుక. ఎలుకలు పట్టుని నాశనం చేసేసేవి. దీంతౌ ఎలుకలను హతమార్చడంకోసం పిల్లులను పెంచసాగారు. కాలక్రమేణా పట్టు పరిశ్రమ ఆగిపోవడంతో ఆ ప్రాంతంలోని వారు జపాన్ నగరాలకు వలసెళ్ళిపోయారు. ఇప్పుడీ దీవిలో మత్స్యకారులు మాత్రమే ఉంటున్నారు. 1945 లో దాదాపు 900 మంది ఇక్కడ నివసించేవారు. వీరిలో చాలామంది ఉదరపోషణకోసం నగరాలబాట పట్టారు. ఇప్పుడు ఈ దీవిలో వందకన్నా తక్కువ మందే ఉంటున్నారు.
ఇక ఓషిమా దీవిలో 22 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడున్న పిల్లుల సంఖ్య 120.
ఈ రెండు దీవులలోనూ మత్స్యకారుల పడవలను ఎలుకలు నాశనం చేసేస్తుండటంతో వాటి పని పట్టడం కోసం పిల్లులను పెంచకతప్పడం లేదంటున్నారు మత్స్యకారులు. ఈ రెండు దీవులలో ఒక మనిషికి ఆరు పిల్లుల చొప్పున ఉంటున్నాయి
మన దేశంలో పిల్లులు అడ్డంగా వస్తే అపశకునమని భావించే వాళ్ళున్నారు. కానీ ఈ దీవులలో పిల్లులు తమకు అడ్డంగా వస్తేనే బోలెడంత డబ్బులు లభిస్తాయని నమ్ముతారు. పిల్లులను అదృష్టంగా భావిస్తారు. కనుక ఇక్కడ పిల్లులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు.
పిల్లులకు ఆహారం పెడతారు. అంతెందుకు ఓషిమాలో పిల్లి దేవాలయమూ ఉంది. ఓ పిల్లిమీద పొరపాటున ఓ గడపార పడి చనిపోయింది. దాంతో బాధపడిన జనం ఆ పిల్లి స్మృత్యర్థం ఈ గుడి కట్టించారు. ఈ దీవికి వచ్చే పర్యాటకులు ఆ గుడిని చూసి ఆశ్చర్యపోతుంటారు. అంతేకాదు, ఈ దీవిలో అక్కడక్కడా పిల్లుల ఆకారంలో ఇళ్ళుకూడా నిర్మించారు. పిల్లుల రూపంలో రాళ్ళను చెక్కి అక్కడక్కడా నాటారు. ఈ రెండు దీవులతో పిల్లులకు ప్రాధాన్యం పెరిగిపోయింది.
జపాన్ రాధాని టోక్యో నగరానికి 120 కిలోమీటర్ల దూరంలో ఈ రెండు దీవులూ ఉన్నాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి