చిన్న చిన్న చినుకులు
చిట పట మని రాలంగా
మెళ్ళిగ పాప చూసింది
ముసి ముసిగా నవ్వింది!!
ముంగిలి లోకి వచ్చింది
గొడుగు చేత పట్టింది
గబగబా అడుగులేసింది
చినుకుల తో ఆడింది !!
అమ్మ వచ్చి చూసింది
ఆగూ ఆగూ చిట్టి పాప
వానలోన ఆడ బోకు
ఇంటిలోకి రావమ్మ !!
జలుబు నీకు చేస్తుంటుంది
చలితో జ్వరం వస్తుంది
డాక్టర్ బాబు వస్తాడు
సూది మందు ఇస్తాడు !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి