వేమ రెడ్డి రాజ కవిగ
భారతాను వాదమ్ము
భవ్యoగాను జేసెనుగ!
మహా భారత రచనందు
అలంకారప్రియమొందు
అరణ్య పర్వ శేశమ్ము
పాఠకులకు మోదమొందు!
శంభుదాస బిరుదుమoది
నన్నయచే స్పూర్తి నొంది
భారతమును పూరించెను
జనులమదిల స్థానమంది!
శైవ భక్తి పరాయణుడు
ప్రబoధ పరమేశ్వరుoడు
కవిరాజుగ వెలిగినట్టి
శివ సేవా దురంధరుడు!
కవిత్రయం కూర్చినది
కవులంతా మెచ్చినది
మహా భారతమ్ముగా
తెలుగు నాటవెలసెనిది!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి