గణనాథుడి హారతి పాట// రచన //యెల్లు అనురాధ రాజేశ్వర్ రెడ్డి
ఓం విద్యాయ నమః 
ఓం విఘ్నరాజాయ నమః
 ఓం సకల శుభాయ నమః 
ఓం సర్వాంతర్యామాయ నమః

గణ గణ గణ గణ గణపయ్య స్వామి గణపయ్య
 ముందు పూజలు నీకేనయ్య సామీ గణపయ్య
 పార్వతి తనయా ప్రథమాయ సామీ గణపయ్య
 మహేశ పుత్ర మహాబలాయా సామీ గణపయ్య
 మహా హారతి నీకే నయ్యా స్వామి గణపయ్య 
పంచహారతి నీకేనయ్యా స్వామి గణపయ్య

గజాననాయ గణాధ్యక్షాయ స్వామి గణపయ్య 
ప్రముఖాయా సుముఖాయా స్వామి గణపయ్య 
గంగాసుతాయ గణాధీశాయ స్వామి గణపయ్య
 మహాహారతి అందుకో స్వామి గణపయ్య
పంచహారతి అందుకో సామీ గణపయ్య

ఇరవై ఒక్క పత్రపూజ స్వామి గణపయ్య 
ఉండ్రాళ్ళతో నైవేద్యము స్వామి గణపయ్య 
ధూపం దీపం తాంబూలము సామీ గణపయ్య 
నీరాజనం మంత్రపుష్పం స్వామి గణపయ్య 
 కర్పూర హారతి అందుకో స్వామి గణపయ్య
త్రిశూల హారతి అందుకో స్వామి గణపయ్య

తొమ్మిది రోజులు మీ పూజలు స్వామి గణపయ్య
 పూజలందుకొని దీవించయ్యా స్వామి గణపయ్య
  మేము చేసే అన్ని పనులలో స్వామి గణపయ్య
 విఘ్నాలను తొలగించయ్యా స్వామి గణపయ్య
 విజయాలను అందించయ్యా సామీ గణపయ్య
సహస్ర హారతి అందుకో సామీ గణపయ్య
హృదయ హారతి అందుకో స్వామి గణపయ్య


కామెంట్‌లు