"ప" గుణింత గేయము:--- మచ్చ అనురాధ తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 పలక చేత పట్టుకుని
పాఠశాలకు రారండి
పిల్లల్లారా రారండి
ప్రీతిగ మీరు చదవండి
పుణ్య దేశము మనదండి
పూర్వీకుల కథలు వినండి
పృథ్వి  పైన యెదగండి
"పౄ" అక్షరం పలకండి
పెద్దలను గౌరవించండి
పేరు ప్రఖ్యాతి  పొందండి
పై పై మెరుగులు వలదండి
పొత్తము చేత పట్టండి
పోట్లాటలు మానండి
పౌరుషంతో మెలగండి
పంతము తో చదవండి.

కామెంట్‌లు