పల్లవి:::
గలగల సెలయేటి నడుమ
కలువ ఎంత స్వచ్ఛమో
కిలకిల పిల్లల నవ్వుల్లో
గురువు ఎంతొ సుగుణము.
"గలగల"
చరణం:
జలజల జలపాత నురగ
చినుకులెంత చల్లనో
మిలమిల మెరిసేటి కనుల
గురువు ప్రేమ సుఫలమూ.
"గలగల"
చరణం::
ఉదయభానుడుదయించిన
నింగి ఎంత ఘనమైనదో
జ్ఞానకాంతి వెదజల్లెడి
గురువు బోధ సుధనమూ.
"గలగల"
చరణం::
చిరుగాలికి కదలాడిన
సుమములెంత అందమో
భవితానికి బాటవేయు
గురువు మాట మధురమూ.
"గలగల"
చరణం::
తిమిరానికి తారకల
వెలుగు ఎంతో తేజమూ
అజ్ఞానం తరిమివేయు
గురువుకిదే వందనం.
"గలగల"
గురు వందనం:- త్రిపురారి పద్మ జనగామ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి