61.ప్రేమ!
బలి చేసినవాడు !
నిజమైన బాహుబలి!
ఆబలి యుగాంతం నిలుచు!
తలచినప్పుడల్లా ,
ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చు!
62.ప్రేమ!
విస్తరించిన మాయాజాలం!
విశ్వాన వింత అంతర్జాలం!
జీవన కంప్యూటర్ ఇన్ పుట్!
సర్వజనప్రమోదం ఔట్ పుట్!
63.ప్రేమ!
అనగానే హేండ్సప్!
సెల్ లో వాట్సాప్!
టి.వి.బ్రేకింగ్ న్యూస్!
"చిప్" అందరం గప్ చిప్!
64.ప్రేమ!
స్లోగన్ కాదు!
స్లోగా పేలే గన్!
క్రమేపీ స్టెన్ గన్!
చివర్లో మెషీన్ గన్!
65.ప్రేమ!
జీవనచక్రం శీల!
జీవితాన చెరగని శీలం!
మహామంత్రం!
బాధలు మటుమాయం!
(కొనసాగింపు)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి