*అక్షర మాల గేయాలు**సంయుక్తాక్షర గేయం ర- ఒత్తు*- *వురిమళ్ల సునంద,ఖమ్మం*

 సమ్రీన్ విక్రం శ్రేయా క్రాంతి
గ్రీష్మ సుప్రజ మంచి మిత్రులు
ప్రతిరోజూ ప్రొద్దున లేస్తారు
శుభ్రంగా తయారు అవుతారు
క్రమం తప్పక బడికి వెళతారు
పెద్దలతో వినమ్రంగా ఉంటారు
సత్ ప్రవర్తన కలిగి ఉంటారు 
శ్రమ అనకుండా బాగా చదువుతూ
పాఠాల్లో ప్రతిభను చూపిస్తారు
 గురువుల ప్రేమ పొందుతారు


కామెంట్‌లు